వెయిట్‌ అండ్‌ సీ | Allari Naresh In Mahesh and Vamsi Paidipalli Movie | Sakshi
Sakshi News home page

వెయిట్‌ అండ్‌ సీ

Published Tue, Dec 19 2017 12:21 AM | Last Updated on Tue, Dec 19 2017 12:21 AM

Allari Naresh In Mahesh and Vamsi Paidipalli Movie - Sakshi

‘అల్లరి’ నరేశ్‌ సన్నగా ఉంటారు. బాగా లావైతే ఎలా ఉంటారు? లడ్డూ బాబులా ఉంటారు. అదేనండీ.. ‘లడ్డూ బాబు’ సినిమాలో ప్రోస్థటిక్‌ మేకప్‌తో లావుగా కనిపించారు. ఇప్పుడు ఏ మేకప్పూ లేకుండానే లావుగా కనిపించనున్నారని టాక్‌. యస్‌.. అల్లరోడు బరువు పెరుగుతున్నారట. ఇదంతా ఏ సినిమా కోసం అంటే వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న మూవీ కోసం అట. 

మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారని చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని పాత్ర కోసమే నరేశ్‌ బరువు పెరగనున్నారట. నిజంగానే బరువు పెరుగుతున్నారా? అంటే.. వెయిట్‌ అండ్‌ సీ. ఈ సినిమాను ‘దిల్‌’ రాజు, అశ్వినీదత్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement