
కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ ప్రస్తుతం ‘నాంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకునే నరేష్ ఇపుడు ‘నాంది’ డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈ సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక అంశాలపై మంచి సందేశం ఇచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది. నరేష్ గతంలో ‘నేను, గమ్యం’ లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసి ఉండటంతో ఈ సినిమా కూడ ఆ తరహాలోనే వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఫిబ్రవరి 19న నాంది ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్‌గా కనిపించనున్నారు.
చదవండి: ‘బంగారు బుల్లోడు’ మూవీ రివ్యూ
తాజాగా నాంది సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. సినిమా ట్రైలర్‌ను శనివారం 10. 08 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘నాంది ట్రైలర్ రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని అల్లరి నరేష్, చిత్రయూనిట్‌కు విషెస్ తెలియజేశారు. ఇక ట్రైలర్‌లో.. ‘రాజగోపాల్ గారిని నేను మర్డర్ చేయడం ఏంటి సార్.. ఇప్పటి వరకు రాజగోపాల్ గారి గురించి వినడం తప్ప ఆయన గురించి నాకేం తెలియదు సార్ అంటూ నరేష్ చెప్పే డైలాగుతో ప్రారంభమైన ట్రైలర్ ఉత్కంఠగా కొనసాగింది. అసలు రాజగోపాల్‌ను నరేష్ హత్య చేశాడా లేక కావాలని అతన్ని ఇరికించారా, నరేష్‌కు రాజగోపాల్‌కు సంబంధం ఏంటి.. ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.
చదవండి: ‘రాధే శ్యామ్’ బిగ్ అనౌన్స్‌మెంట్ : టీజర్ ఆరోజే..
Happy to unveil the trailer of #Naandhi!! Looks intense... Wishing @allarinaresh and the entire team a blockbuster success. 😊@vijaykkrishna @varusarath5 @SV2Enthttps://t.co/0NI8Aa51Hk
— Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2021
కాగా మహేష్ అల్లరి నరేష్ కలిసి ‘మహర్షి’లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వీళ్లిద్దరూ కాలేజీ మిత్రులుగా నటించారు. ఇక ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్యా మంచి సాన్నిహిత్యం, స్నేహం ఏర్పడ్డాయి. అందులో భాగంగానే మహేష్ బాబు నరేష్ నాంది సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్న నరేష్ ఈ సినిమాతోనేనై విజయం సాధిస్తాడో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉండగా మహేష్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. సర్కారు వారి పాట షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పరుశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment