‘అదిరింది రా.. నాంది కోసం వెయిటింగ్‌’ | Mahesh Babu And Nani Birthday Wishes To Allari Naresh | Sakshi
Sakshi News home page

‘నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు’

Published Tue, Jun 30 2020 4:43 PM | Last Updated on Tue, Jun 30 2020 4:43 PM

Mahesh Babu And Nani Birthday Wishes To Allari Naresh - Sakshi

తెరంగేట్రం చేసిన తొలి చిత్రం పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న కామెడీ హీరో అల్లరి నరేశ్‌. ఓ వైపు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ పలు విభిన్న చిత్రాల చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో పూర్తిగా తన పంథా మార్చుకొని పలు సీరియర్‌ క్యారెక్టర్స్‌ ట్రై చేస్తున్నాడు. ఇలా ప్రయోగాత్మకంగా చేసింది ‘నాంది’. ఈరోజు నరేశ్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు వస్తున్నాయి. అతడి తాజా చిత్రాలు నాంది, బంగారు బుల్లోడు చిత్రాల టీజర్లు విడుదల అయ్యాయి. (అందుకే సీరియస్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నాను)

‘మ‌నిషి పుట్ట‌డానికి కూడా తొమ్మిది నెల‌లే టైమ్ ప‌డుతుంది.. కానీ న్యాయం చెప్ప‌డానికేంటి సార్ ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతోంది’ అంటూ నాంది టీజర్‌లో అల్లరి నరేశ్‌ చెప్పే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక రెండు టీజర్లకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో అల్లరి నరేశ్‌తో పాటు చిత్ర బృందాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక నరేశ్‌ బర్త్‌డే సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు అతడికి బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. అంతేకాకుండా నరేశ్‌ కొత్త చిత్రాలకు విషెస్‌ తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా పలు పోస్ట్‌లు పెడుతున్నారు. (‘దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నా’)

ముఖ్యంగా నరేశ్‌ స్నేహితుడు నేచరల్‌ స్టార్‌ నాని చేసిన ట్వీట్‌ కొత్తగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ‘అదిరింది రా.. నీకు, నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు. నాంది సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నా’ అంటూ నాని ట్వీట్‌ చేశాడు. నానితో పాటు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దగ్గుబాటి రానా, దర్శకుడు హరీష్‌ శంకర్‌, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు నానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  (కదలని చిత్రం- బతుకు ఛిద్రం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement