‘మహర్షి’ డబ్బింగ్ మొదలైంది..! | Mahesh Babu Maharshi Dubbing Work Started | Sakshi
Sakshi News home page

‘మహర్షి’ డబ్బింగ్ మొదలైంది..!

Published Thu, Feb 7 2019 12:35 PM | Last Updated on Sun, Apr 7 2019 12:28 PM

 Mahesh Babu Maharshi Dubbing Work Started - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల స్పీడు పెంచారు.

తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ పనులు ప్రారంభించాడు దర్శకుడు వంశీ. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేష్‌తో పాటు నిర్మాత దిల్‌ రాజు పాల్గొన్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా కేయు మోహన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement