ఆర్య, ఆర్య 2 సినిమాలతో అలరించిన అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా సుకుమార్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కావటంతో వెంటనే బన్నీ హీరోగా సినిమాను ప్రకటించాడు సుక్కు. అయితే తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది.
సుకుమార్.. మహేష్ బాబు కోసం తయారు చేసుకున్న కథనే కొద్ది పాటి మార్పులతో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించనున్నాడట. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. బన్నీ.. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment