నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాతో షాక్ తిన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఈ గ్యాప్‌లో బన్నీ తనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ చిత్రాలను అంధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట.
ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, నాగబాబు, రావూ రమేష్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే బన్నీ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment