ఆ కోరిక నాకు లేదు | Am the luckest herione in my generation, says Shreya | Sakshi
Sakshi News home page

ఆ కోరిక నాకు లేదు

Published Tue, Aug 5 2014 12:52 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఆ కోరిక నాకు లేదు - Sakshi

ఆ కోరిక నాకు లేదు

 వయసైన హీరోల పక్కన నటించడానికి స్టార్ హీరోయిన్లు ఎలాగైతే ఇష్టపడరో, కాస్త వయసు మీరిన హీరోయిన్లతో జతకట్టడానికి స్టార్ హీరోలు కూడా ఇష్టపడరు. ప్రస్తుతం శ్రీయ అలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. పవన్, మహేశ్, ఎన్టీఆర్, ప్రభాస్... ఇలా ప్రస్తుతం ఉన్న టాప్ స్టార్లు అందరితోనూ జతకట్టి విజయాలు చవిచూసిన హీరోయిన్ శ్రీయ. కానీ, ప్రస్తుతం వారితోనే నటించలేని పరిస్థితి. ఈ విషయాన్ని ఆమె ముందు ప్రస్తావిస్తే... ‘వారి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా..’ అని ధీమాగా సమాధానమిచ్చారు శ్రీయ. ‘‘నా అంత లక్కీ హీరోయిన్ నా జనరేషన్‌లో లేదు.
 
  ఎందుకంటే... ముందు జనరేషన్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో జతకట్టాను. నేటి జనరేషన్ హీరోలైన పవన్, మహేశ్, ఎన్టీఆర్, ప్రభాస్‌ల సినిమాల్లో హీరోయిన్‌గా చేశాను. ఈ క్రెడిట్ నా తరంలో నాకు మాత్రమే దక్కింది. ఇప్పుడు కూడా వారి సరసన హీరోయిన్‌గా నటించాలని నాకు లేదు. నేను చేయదగ్గ పాత్రలు లభిస్తే చేయడానికే సిద్ధంగా ఉన్నా ను’’ అని చెప్పారు శ్రీయ. విలక్షణమైన, వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉందనీ, ప్రస్తుతం వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున్న ‘గోపాల గోపాల’ చిత్రంలో తనది మంచి పాత్ర అని శ్రీయ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement