రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమృతరామమ్’. ‘దేర్ ఈజ్ నో లవ్ వితౌట్ పెయిన్’ అనేది ఉప శీర్షిక. సురేందర్ కొంటడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే పలు కారణాలతో చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ‘అమృతరామమ్’ రిలీజ్ డేట్‌పై చిత్ర బృందం అధికారక ప్రకటన చేసింది. ఉగాది కానుకగా మార్చి25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలోనే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు కూడా పేర్కొంది.
ఇప్పటికే ‘అమృతరామమ్’ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌లు ప్రేమికులకు కనెక్ట్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ముఖ్యంగా ‘ప్రేమంటే ఇంతేనా యదలోని వ్యధలేనా..’ అంటూ సాగే ఓ ప్రేయసి విరహ గీతం సంగీత శ్రోతలను కట్టిపడేసింది. ఈ పాటను అనన్య భట్ ఆలపించగా.. రామదుర్గం మధుసుధన్ హార్ట్ టచింగ్ లిరిక్స్ అందించారు. ఎన్.ఎస్. ప్రసు సంగీతాన్ని అందించారు. ట్రైలర్‌లోని డైలాగ్స్ కూడా ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించే విధంగా ఉన్నాయి. శ్రీజిత్ గంగాధర్, ఎమిలి మార్టిన్, సారా జోన్స్, శుక్రుతి నారాయణ్, చెరుకూరి జగదీశ్వర్‌రావ్, వంశీ దావులూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల అవుతోంది.
చదవండి:
కరోనా ఎఫెక్ట్.. మాస్క్‌తో ప్రభాస్
యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న‘నీలి నీలి ఆకాశం..’
‘అమృతరామమ్’ ఎప్పుడంటే?
Published Wed, Mar 4 2020 3:11 PM | Last Updated on Wed, Mar 4 2020 3:11 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment