పవన్ చెల్లి పాత్రలో ఆనంది | Anandi to Play Pawan kalyan sister in Neason Film | Sakshi
Sakshi News home page

పవన్ చెల్లి పాత్రలో ఆనంది

Published Sun, Nov 13 2016 2:00 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ చెల్లి పాత్రలో ఆనంది - Sakshi

పవన్ చెల్లి పాత్రలో ఆనంది

ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న సినిమాతో పాటు రాధకృష్ణ నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ఈ రెండు సినిమాలకు సంబందించిన నటీనటలు ఎంపిక కూడా శరవేగంగా జరుగుతోంది.

ముఖ్యంగా నేసన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వేదలం కు రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎంతో కీలకమైన చెల్లెలి పాత్రకు ఓ తెలుగమ్మాయినే ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బస్ స్టాప్ సినిమాతో పరిచయం అయిన ఆనంది, తరువాత తమిళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ అమ్మాయినే పవన్కు చెల్లిగా ఫైనల్ చేశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఇతర నటీనటుల వివరాలతో పాటు సినిమా ఎప్పుడు మొదలుకానుందో తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement