
పవన్ తరువాత బన్నీతో..!
నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమెరికన్ బ్యూటీ అను ఇమ్మాన్యూల్. తొలి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తరువాత రాజ్ తరుణ్ సరసన కిట్టూ ఉన్నాడు జాగ్రత్త సినిమాలో నటించింది. ఇద్దరు యంగ్ హీరోల సినిమాలతో ఆకట్టుకున్నా ఈ బ్యూటీ మూడో సినిమాతోనే ఏకంగా పవర్ స్టార్తో జోడి కట్టే ఛాన్స్ కొట్టేసింది.
పవన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో కీర్తి సురేష్తో పాటు అను ఇమ్మాన్యూల్ కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో క్రేజీ ఆఫర్ను సొంతం చేసుకుంది అను. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాలో అనును హీరోయిన్గా ఫైనల్ చేశారట. అయితే ఈ సినిమాలో అనునే లీడ్ హీరోయినా.. లేక మరో హీరోయిన్ ఉంటుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.