విరాట్ కోహ్లీ, అనుష్కల డేటింగ్ రచ్చ రచ్చ!
విరాట్ కోహ్లీ, అనుష్కల డేటింగ్ రచ్చ రచ్చ!
Published Tue, Dec 31 2013 4:39 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
సినీ తారలు, క్రికెటర్ల సంబంధాలు సర్వ సాధారణమే. అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీలపై సెంచరీలు బాదుతూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ లో సరైన హిట్టులేక అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అనుష్క శర్మల ప్రేమ వ్యవహారం అటు క్రికెట్ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వీరిద్దరు కలిసి ఓ అడ్వర్టైజ్ మెంట్ లో నటించిన తర్వాత అనుష్క, కోహ్లీల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత దగ్గరైట్టు సమాచారం. అనుష్క, విరాట్ లు గత కొద్దికాలంగా డిన్నర్, డేటింగ్, లాంగ్ డ్రైవ్ లతో కాలం గడుతున్నట్టు ముంబై మీడియా కోడై కూస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్ల్యూలో కోహ్లీతో ఉన్న రిలేషన్ గురించి అనుష్క శర్మ క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చుకుంది. ఎప్పటిలానే తమ మధ్య ఉంది కేవలం ఫ్రెండ్ షిప్ అని కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తొంది. గతంలో బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్, రణ్ వీర్ సింగ్ లతో అనుష్క డేటింగ్ బాలీవుడ్ లో పతాక శీర్షికల్లో నిలిచిన సంగత తెలిసిందే. అదే మాదిరిగా విరాట్ కోహ్లీతో అనుష్క రిలేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అమీర్ ఖాన్ తో పీకే, రణబీర్ కపూర్ తో బాంబే వెల్వెట్ చిత్రాల్లో నటిస్తున్న అనుష్క డేటింగ్ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement