
మేనల్లుడు చిత్రానికి మేనమామ సంగీతం
ఒకరు ఆస్కార్ అవార్డు గ్రహీత, మరొకరు యువ క్రేజీ సంగీత దర్శకుడు, యువ కథానాయకుడిగా దూసుకెళుతున్న నటుడు కూడా. వీరి కలయికలో చిత్రం వస్తే అది ప్రత్యేకతను సంతరించుకుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.అలాంటి చిత్రానికి త్వరలో శ్రీకారం జరగనుందన్నదే తాజా సమాచారం.అవును మేనల్లుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించనున్న చిత్రానికి ఆయన మేనమామ, సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత భాణీ అందించడానికి సిద్ధం అవుతున్నారు.
దీనికి రాజీవ్‌మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు మిన్సార కనవు, కండుకొండేన్ కండుకొండేన్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం.చాలా గ్యాప్ తరువాత రాజీవ్‌మీనన్ మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు.ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. జీవీ ప్రస్తుతం ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రాన్ని పూర్తి చేసి కడవుళ్ ఇరుక్కాన్ కుమారు చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత పాండిరాజ్ దర్శకత్వంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఆ తరువాత రాజీవ్‌మీనన్ చిత్రంలో జీవీ నటించనున్నట్లు సమాచారం.