ఆ సెట్‌.. ఈ సెట్‌.. భలే సెట్‌ | aravinda sametha veera raghava shooting in hyderabad | Sakshi
Sakshi News home page

ఆ సెట్‌.. ఈ సెట్‌.. భలే సెట్‌

Jul 31 2018 1:29 AM | Updated on Aug 22 2019 9:35 AM

aravinda sametha veera raghava shooting in hyderabad - Sakshi

ఎన్టీఆర్

అతనేమో రాఘవ. మామూలు రాఘవ కాదు. వీర రాఘవ. ఆమె అరవింద. అందంగా ఉంటుంది. అరవింద సమేతంగా వీర రాఘవ ఏం చేశాడు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఇప్పుడు మాత్రం రాఘవ ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈషా రెబ్బ కీలక పాత్రలో కనిపించనున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై యస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

రెండు వేరు వేరు స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్స్‌లో ఏకకాలంలో çషూటింగ్‌ చేస్తున్నారు. ఈ సెట్స్‌ భలే ఉన్నాయట. రెండు సెట్స్‌లో షూటింగ్‌ కూడా భలేగా ప్లాన్‌ చేశారట. దాంతో అటూ ఇటూ తిరుగుతూ లొకేషన్‌ షిఫ్ట్‌ చేస్తున్నారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం టాకీ పార్ట్‌ కంప్లీట్‌ చేస్తున్నారట. సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో సాంగ్‌ షూట్‌ కోసం చిత్రబృందం ఫారిన్‌ వెళ్లనుంది. సెప్టెంబర్‌ 15 కల్లా షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. నాగబాబు, నవీన్‌ చంద్ర, ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 10న విడుదల కానుంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పీయస్‌ వినోద్‌ కెమెరామేన్‌.2
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement