
బాలీవుడ్‌లో కొత్త ప్రేమకథను షురూ చేశారు రకుల్‌ప్రీత్ సింగ్. ఈ ప్రేమకథ సుఖాంతం కావడానికి ఎన్నో మలుపులు. ఆ మలుపుల చిక్కుముడులు ఎలా వీడాయి? అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. అర్జున్‌కపూర్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న హిందీ చిత్రం ప్రారంభమైంది. కాష్వీ నాయర్ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. భూషణ్ కుమార్, నిఖిల్ అద్వానీ, జాన్ అబ్రహాం నిర్మిస్తున్నారు. ‘‘పిక్చర్ షురూ (సినిమా మొదలైంది). మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు అర్జున్ కపూర్.
Comments
Please login to add a commentAdd a comment