
‘యముడు, సింగం 3’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన స్టూడియో గ్రీన్ సంస్థ తమ తదుపరి సినిమాను ఎనౌన్స్ చేసింది. ‘ఇంకొక్కడు’ సినిమాతో దర్శకునిగా పరిచయం అయిన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాం అని అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరంటూ ? ఒక చిన్న పజిల్‌ను అభిమానులకు వదిలేశారు. ‘గెస్ చేస్తూ ఉండండి’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది స్టూడియో గ్రీన్ సంస్థ. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అదే. మధ్యలో ఉన్నది హీరో. ఆ హీరో ఎవరు? అనే సస్పెన్స్‌కి కొన్ని గంటల్లో ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు. అయితే ఎక్కువ ప్రచారంలో ఉన్న పేరు విజయ్ దేవరకొండ. ఈ మధ్య ఆనంద్ శంకర్ చెప్పిన కథ విజయ్ దేవరకొండకు నచ్చిందనే వార్త షికారు చేస్తోంది. సో.. ఈ చిత్రంలో నటించబోయేది విజయ్ దేవరకొండ అని ఫిక్స్ అవుదామా?
Comments
Please login to add a commentAdd a comment