
అర్చన
అర్చన మసలి ప్రధాన పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరుంధతి అమావాస్య’. శ్రీ కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. వంశీధర్ సమర్పణలో కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మించారు. ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘అరుంధతికి, అఘోరాకి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
అమావాస్య రోజున ముగిసే ఈ పోరాటంలో ఎన్నో మలుపులు ఉంటాయి. ఈ సినిమాలో పాము కీలక పాత్ర పోషించింది. గ్రాఫిక్స్ సన్నివేశాలకు ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. భారీ బంగ్లాలో చిత్రీకరించిన సన్ని వేశాలు హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు. ‘‘షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాత. బేబీ కీర్తన, షకీలా, నిహారిక తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘనశ్యామ్.