తెరపైకి అంబేద్కర్ జీవిత చరిత్ర | B. R. Ambedkar Biography on Screen | Sakshi
Sakshi News home page

తెరపైకి అంబేద్కర్ జీవిత చరిత్ర

Published Tue, Jun 14 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

తెరపైకి అంబేద్కర్ జీవిత చరిత్ర

తెరపైకి అంబేద్కర్ జీవిత చరిత్ర

 భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా న్యూస్. రన్‌హార్స్ మీడియా పతాకంపై అజయ్‌కుమార్ బాబాసాహెబ్ పేరుతో ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించ తలపెట్టారు. దీని గురించి ఆయన తెలుపుతూ ప్రస్తుతం రౌడీల జీవిత ఇతివృత్తాలతో చిత్రాలు అధికంగా రూపొందుతున్నాయన్నారు.
 
  అలాంటిది ఒక జాతీయ నాయకుడి జీవిత చరిత్రను సినిమాగా ఆవిష్కరించకూడదన్న ఆలోచనకు రూపం దాల్చనున్న చిత్రం బాబాసాహెబ్ అని తెలిపారు. ఇది ఒక జాతి నాయకుడి కథగా కాకుండా ఒక దేశ నాయకుడి కథగా ఈ చిత్రం ఉంటుందన్నారు. కాగా ఇందులో బాబాసాహెబ్ పాత్రదారుడి కోసం 10 వేలకు పైగా నటులను పరిశీలించినా ఒక్కరూ సెట్ కాలేదన్నారు.
 
 చివరికి తమ ఛాయాగ్రహకుడు మోహన్ సూచన మేరకు ఆయ్‌వుకూట్టం చిత్ర హీరో రాజ్‌గణపతికి మేకప్ టెస్ట్ చేయగా ఆయన రూపం బాబాసాహెబ్‌లానే ఉందన్నారు. కాగా ఆయన బాల్యం, యుక్త వయసు పాత్రల కోసం, భారతీయార్, పెరియార్, ఇతర నటీనటుల ఎంపికను, అంబేద్కర్ 125వ జయంతోత్సవకార్యక్రమాన్ని ఆ నెల 19న స్థానిక ఆవడిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా చిత్ర షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు అజయ్‌కుమార్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement