బాహుబలి టీవీ సీరీస్ వచ్చేస్తోంది..! | Baahubali tv series will be made in hindi first | Sakshi
Sakshi News home page

బాహుబలి టీవీ సీరీస్ వచ్చేస్తోంది..!

Published Fri, May 5 2017 3:48 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

బాహుబలి టీవీ సీరీస్ వచ్చేస్తోంది..!

బాహుబలి టీవీ సీరీస్ వచ్చేస్తోంది..!

ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి త్వరలో బుల్లితెర వీక్షకులను కూడా అలరించనుంది. తొలి భాగం రిలీజ్ సమయంలోనే బాహుబలి టీవీ సీరీస్ను ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముగియటంతో ఇప్పుడు టీవీ సీరీస్ మీద దృష్టి పెట్టారు. ఈ మేరకు బాహుబలి టీవీ సీరీస్పై చిత్రయూనిట్ ఓ ప్రకటన చేసింది.

బాహుబలి టీవీ సీరీస్ను ముందుగా హిందీలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం బాహుబలి మార్కెట్ స్పాన్ భారీగా పెరగటంతో ముందుగా హిందీలో తెరకెక్కించి తరువాత ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాగా వచ్చిన కథ కాకుండా రైజ్ ఆఫ్ శివగామి.. లేదా బాహుబలి కన్క్లూజన్ తరువాతి పరిణామాల నేపథ్యంలో టీవీ సీరీస్ తెరకెక్కనుంది. ఈ సీరీస్ను 10 నుంచి 13 ఎపిసోడ్స్గా రూపొందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement