
సుధీర్ఘ సినీ కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టలేదు. కానీ తన తండ్రి బయోపిక్ నిర్మించాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో తాను నిర్మాతగా మారితే బాగుంటుందని భావించారు. అందుకే ఎన్బీకే ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించి యన్.టి.ఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలకు దారుణమైన ఫలితాలు రావటంతో నిర్మాణ రంగంలో కొనసాగటంపై బాలయ్య ఆలోచనలో పడ్డారట.
ఇప్పటికే బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నట్టుగా బాలకృష్ణ ప్రకటించాడు. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమాను కూడా బయటి బ్యానర్‌లోనే చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి ప్రయత్నమే తేడా కొట్టడంతో ఇక నిర్మాతగా కొనసాగకపోవటమే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి నిజంగానే బాలయ్య నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటాడా..? లేదా అన్న విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment