‘అనుక్షణం’ బాటలో ‘భూ’ | bhoo movie releasing in auction | Sakshi
Sakshi News home page

‘అనుక్షణం’ బాటలో ‘భూ’

Published Mon, Oct 6 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

‘అనుక్షణం’ బాటలో ‘భూ’

‘అనుక్షణం’ బాటలో ‘భూ’

 ఓ చిత్రాన్ని వేలం పాట ద్వారా పంపిణీ చేయడం అనే విధానం ‘అనుక్షణం’తో మొదలైన విషయం తెలిసిందే. ఇప్పుడా ఖాతాలో ‘భూ’ అనే మరో చిత్రం చేరింది. మహేశ్ కత్తి సమర్పణలో స్వీయదర్శకత్వంలో శ్రీ కిశోర్ నిర్మించిన చిత్రం ఇది. ఈ నెల 10న వేలం ఆరంభించనున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ చిత్రాలన్నిటికన్నా భిన్నంగా ఉంటుందని శ్రీ కిశోర్ అన్నారు. మహేశ్ కత్తి మాట్లాడుతూ - ‘‘పంపిణీరంగంలో నియంతృత్వ ధోరణిని అధిగమించాలనే ఉద్దేశంతోనే ఈ వేలం విధానాన్ని అనుసరిస్తున్నాం’’ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉండే కామిక్ హారర్ థ్రిల్లర్ ఇదని చిత్రకథానాయిక సుప్రియ తెలిపారు. మంచి పాటలివ్వడానికి కుదిరిందని, రీ-రికార్డింగ్‌కి కూడా స్కోప్ ఉన్న చిత్రమని కె.సి. మౌళి అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: రవికాంత్, ఉదయప్రకాశ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement