బిగ్‌బాస్‌.. వారి మధ్య చిచ్చుపెట్టేశాడు! | Bigg Boss 3 Telugu : Family Members Meet Their Contestants | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. వారి మధ్య చిచ్చుపెట్టేశాడు!

Published Fri, Sep 20 2019 10:58 PM | Last Updated on Fri, Sep 20 2019 11:13 PM

Bigg Boss 3 Telugu : Family Members Meet Their Contestants - Sakshi

ఆరవై రోజుల పండగ అంటూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకొచ్చిన బిగ్‌బాస్‌.. కొందరికి ఆనందాన్ని, మరికొందరికి బాధను మిగిల్చాడు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్య కూడా చిచ్చుపెట్టేశాడు. అయితే తమ ఫ్యామిలీ మెంబర్స్‌ను కలవలేకపోయిన శ్రీముఖి, శివజ్యోతిలు ఓ రేంజ్‌లో కన్నీటిని కార్చేశారు. అసలేం జరిగిందంటే.. ఫ్యామిలీ మెంబర్స్‌ తాము తీసే బాక్సులో బిగ్‌బాస్‌ ఐ మార్క్‌ వస్తేనే కంటెస్టెంట్లను కలుస్తారని బిగ్‌బాస్‌ ఓ ఆట ఆడించాడు. వితికా కోసం వచ్చిన రాజు, రవి కోసం వచ్చిన అతని మామయ్య, పునర్నవి కోసం వచ్చిన ఆమె సోదరుడు, హిమజకు మద్దతుగా వచ్చిన రోజా.. శివజ్యోతి సోదరుడు ధన్‌రాజ్‌లకు మాత్రమే బిగ్‌బాస్‌ ఐ మార్క్‌ వచ్చింది. మిగతా వారందరికీ జోకర్‌ బొమ్మ రావడంతో వెనుదిరిగిపోయారు. అయితే వెళ్లేముందు కంటెస్టెంట్లకు తామివ్వదల్చిన సందేశాన్ని ఇవ్వొచ్చని తెలిపాడు.

శ్రీముఖి తరుపున వచ్చిన ఆమె సోదరుడు శుశ్రుత్‌కు జోకర్‌ బొమ్మ రావడంతో.. భోరున విలపించింది. ఇది తనకు నచ్చలేదని, ఇస్తే అందరికీ అవకాశమివ్వాలంటూ బిగ్‌బాస్‌ను శ్రీముఖి నిందించసాగింది. ఒక్కసారి తన తమ్ముడిని కలిసే అవకాశమివ్వండంటూ శ్రీముఖి వేడుకుంది. బిగ్‌బాస్‌ ఐ బొమ్మ వచ్చిన ఆ ఐదుగురు సెకండ్‌ లెవెల్‌కు వచ్చారని.. ఇక్కడి నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఇద్దరు మాత్రమే వెళ్తారంటూ తెలిపాడు. అందుకోసం.. ఇంటి సభ్యుల్లోని టాప్‌ టూ కంటెస్టెంట్ల ఎవరంటూ డిసైడ్‌ చేయాలని తెలిపాడు. అందుకోసం ఓ డిబెట్‌ చేయాల్సి ఉంటుందని.. అర్థగంట సమయాన్ని కేటాయించాడు. దీంతో వారి మధ్య చిచ్చు పెట్టేసినట్టైంది. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులను చూడటానికి వచ్చిన వారు పోట్లాడుకునేదాకా బిగ్‌బాస్‌ తెచ్చేశాడు.

అయితే ఆ చర్చ ఎంతకూ ఓ కొలిక్కి రాకపోవడంతో.. బిగ్‌బాస్‌ మరో అవకాశాన్ని ఇచ్చాడు. వారికి ఎదురుగా ఐదు బాక్సులను పెట్టి ఒకదాన్ని ఎంచుకోమని తెలిపాడు. ఎవరి దాంట్లో బిగ్‌బాస్‌ ఐ మార్క్‌ వస్తే వారికే తమ కంటెస్టెంట్లను కలిసే అవకాశాన్ని ఇస్తానని తెలిపాడు. దీంతో వితికా సోదరుడు రాజు, రవి మామయ్య శ్రీనివాస్‌కు ఆ లక్కీ చాన్స్‌ వచ్చింది. వీరిద్దరి కన్ఫెషన్‌ రూమ్‌లో తమ కంటెస్టెంట్‌ను కలిసేందుకు పర్మిషన్‌ ఇచ్చాడు. ఇక శివజ్యోతికి తన సోదరుడును కలుసుకోలేక పోయినందుకు వెక్కి వెక్కి ఏడ్చింది.

అనంతరం హౌస్‌మేట్స్‌ అందరికీ ఓ టాస్క్‌ ఇచ్చాడు. దీంట్లో భాగంగా.. మగవారిని, ఆడవారిని రెండు టీమ్స్‌గా విభజించాడు. ఏ కారణం లేకున్నా మగవారు ఏడ్చి చూపించాలనగా.. అందులో సఫలం కాలేకపోయారు. ఆడవారంతా.. పది నిమిషాల్లో రెడీ అవ్వాలనే టాస్క్‌లో వారు విజయం సాధించారు. బెడ్రూం శుభ్రంగా ఉంచాలని టాస్క్‌లో సక్సెస్‌కాగా, జనరల్‌ నాలెడ్జ్‌ విషయంలో ఆడవారి టీమ్‌ ఓడిపోయింది. ఇక ఈ హౌస్‌లో తొమ్మిదో వారం కూడా పూర్తయ్యేందుకు వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రాహుల్‌, మహేష్‌, హిమజ నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ ముగ్గురిలోంచి ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement