బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌! | Bigg Boss 3 Telugu Punarnavi Fires On Task In Eight Week | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

Published Tue, Sep 10 2019 11:00 PM | Last Updated on Tue, Sep 10 2019 11:03 PM

Bigg Boss 3 Telugu Punarnavi Fires On Task In Eight Week - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ దెయ్యాల కోటగా మారింది. ఇంట్లోని కొంతమందిని దెయ్యాలుగా మార్చిన బిగ్‌బాస్‌.. మిగతావారిని హత్య చేసి దెయ్యాలుగా మార్చాలనే టాస్క్‌ ఇచ్చాడు. వితికా, బాబా, హిమజ, రాహుల్‌, శిల్పాలు దెయ్యాలుగా అవతారమెత్తుతారని తెలిపాడు. ఈ దెయ్యాలు మనుషులను విసిగిస్తూ ఉండాలని చివరకు హత్య చేయాల్సి ఉంటుందని సూచించాడు. 

ఈ క్రమంలో శ్రీముఖిపై గుడ్డు పగలగొట్టాలని, వరుణ్‌కు మూడుసార్లు ముద్దుపెట్టాలని, బాత్రూం అద్దాలపై వరుణ్‌ ఈజ్‌ ఘోస్ట్‌ అని రాయాలని, మహేష్‌ చేత ఐదుసార్లు షర్ట్‌ విప్పేలా చేయాలని, పునర్నవిని స్విమ్మింగ్‌పూల్‌లో పడేయాలని, రవి చేత డ్యాన్సులు చేయించాలని, శివజ్యోతిని ఏడ్పించాలనే టాస్క్‌లను ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా మొదటి రోజు ముగ్గురిని మాత్రమే హత్య చేయాలని తెలిపాడు.

దీంతో దెయ్యాలు బిగ్‌బాస్‌ హౌస్‌ను గందరగోళంగా మార్చేశాయి. అందర్నీ ఏడిపిస్తూ, విసిగిస్తూ.. మనుషులను వేధించసాగాయి. ఈ క్రమంలో వరుణ్‌ సందేశ్‌ను వితికా మూడుసార్లు ముద్దుపెట్టింది. అనంతరం బాత్రూం అద్దాలపై వరుణ్‌ ఈజ్‌ ఏ ఘోస్ట్‌ అని రాయడంతో.. వరుణ్‌ హత్యుకు గురైనట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. దీంతో వరుణ్‌ దెయ్యంగా, వితికా మనిషిగా మారింది.

మరోవైపు శ్రీముఖి తలపై హిమజ గుడ్డు పగలగొట్టింది. దీంతో శ్రీముఖి సైతం హత్యకు గురైనట్లు ప్రకటించాడు. వితికా, శిల్పా, బాబా భాస్కర్‌లు కలిసి పునర్నవిని స్విమ్మింగ్‌ పూల్‌లో పడేశారు. అయితే ఒకసారి ఒక మనిషిని మాత్రమే చంపేయాల్సి ఉండగా.. శ్రీముఖిపై గుడ్డు పగలగొట్టడం, పునర్నవిని తోసేయడం ఒకేసారి జరిగాయి. పూల్‌ వద్ద కూర్చొన్న పునర్నవిని శిల్పా మరోసారి తోసేసింది. దీంతో పునర్నవి సైతం హత్యకు గురైందని తెలిపాడు.

తనను ఈడ్చుకుని పూల్‌లో పడేశారని, కూర్చొని ఉన్నా.. మళ్లీ తోసేశారని పునర్నవి ఫైర్‌ అయింది. తాను ఈ గేమ్‌ ఆడబోనని తెగేసి చెప్పింది. కావాలంటే ఈ ఆట మీరే ఆడుకోండని బిగ్‌బాస్‌నే ఎదిరిచింది. అయితే ఇదంతా టాస్క్‌లో భాగమని వరుణ్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. పునర్నవి కూల్‌ కాలేదు. అయితే బిగ్‌బాస్‌ ఆదేశాలను ధిక్కరించినందుకు పునర్నవి, శ్రీముఖి, మహేష్‌లకు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. హౌస్‌మేట్స్‌ ఈ టాస్క్‌ను అయినా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement