డబుల్‌ సెంచరీ కొట్టిన బిగిల్‌ | Bigil Movie Collections: Rs 200 Crores In Five Days | Sakshi
Sakshi News home page

డబుల్‌ సెంచరీ కొట్టిన బిగిల్‌

Published Wed, Oct 30 2019 4:08 PM | Last Updated on Wed, Oct 30 2019 4:28 PM

Bigil Movie Collections: Rs 200 Crores In Five Days - Sakshi

బిగిల్‌ పేరు చెప్తేనే విజయ్‌ అభిమానులు ఈల వేస్తున్నారు. సినిమా విడుదలై అయిదు రోజులు కావస్తున్నా విజయ్‌ ఫ్యాన్స్‌ థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. ద్విపాత్రాభినయంలో విజయ్‌ కట్టిపడేసాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీపావళికి విజయ్‌ ఇచ్చిన భారీ కానుక ‘బిగిల్‌’ అంటూ ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. విజయ్‌ కథానాయకుడిగా నటించిన బిగిల్‌ చిత్రం తెలుగులో విజిల్‌ పేరుతో విడుదలైంది. దర్శకుడు అట్లీ, హీరో విజయ్‌ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ సినిమాల సరసన బిగిల్‌ చేరిపోయింది.

ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన మెర్సల్‌, సర్కార్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తూ రూ.200 కోట్లు అందుకోగా తాజాగా బిగిల్‌ కూడా వసూళ్లపరంగా రెండు సెంచరీలు పూర్తి చేసుకుంది. మొదట ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల సునామీతో అవన్నీ నీటిపై రాతలుగా తేలిపోయాయి. అమెరికాలోనూ ఈ చిత్ర కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతోంది. బిగిల్‌ చిత్రం ఇప్పటివరకూ అక్కడ 1 మిలియన్‌ కలెక్షన్లు సాధించింది. రికార్డులను తిరగరాస్తున్న బిగిల్‌ రూ.250 కోట్లను అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీపావళికి సినిమాల పోటీ తక్కువగా ఉండటం సినిమాకు కలిసొచ్చిన అంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement