తెరపై రామానుజుల జీవితచరిత్ర! | Biography ramanujula on the screen! | Sakshi
Sakshi News home page

తెరపై రామానుజుల జీవితచరిత్ర!

Published Sat, Aug 1 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

తెరపై రామానుజుల జీవితచరిత్ర!

తెరపై రామానుజుల జీవితచరిత్ర!

 కులమతాలకు అతీతంగా దైవానుగ్రహాన్ని పొందవచ్చనే విషయాన్ని నిరూపించిన మహనీయుడు భగవత్ శ్రీరామానుజులు. ఆయన జీవితాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సంఘ సంస్కర్త భగవత్ రామానుజులు’. అమృత క్రియేషన్స్ పతాకంపై మర్రి జమునారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మంజుల సూరోజు దర్శకురాలు. హైదరాబాద్‌లో ఈ సినిమా పాటల సీడీని చినజీయర్ స్వామీజీ ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఎన్ని కులాలు, మతాలున్నా అందరూ కలిసి మెలిసి ఉండాలనే సందేశాన్ని రామానుజులు అందించారు. అందరూ సమానమే అనే సత్యాన్ని ప్రవచించిన ఓ మహనీయుని జీవితం ఆధారంగా తీస్తున్న  ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు.
 
 ‘‘గొప్ప ఆలోచనతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. ఓ మహోన్నత వ్యక్తిత్వాన్ని తెర మీద ఆవిష్కరించే అవకాశం రావడం నిజంగా అదృష్టం. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రం ఇది’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అహోబిల  రామనుజ జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి, ‘గజల్’  శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement