కుటుంబ కథలో... హారర్ క్వీన్
అందచందాలతో అందరినీ ఆకర్షిస్తూ వచ్చిన బిపాసా బసు ఈ మధ్య వరుసగా హారర్ కథా చిత్రాలకే పరిమితమవుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఆ పాత్రలు బిపాసాకు కూడా బోర్ కొట్టినట్లున్నాయి. తాజాగా ఆమె తన రూటు మారుస్తున్నారు. ‘‘ఇప్పుడు హారర్ కథా చిత్రాలకు కాస్తంత విరామం ఇస్తూ, ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నా’’ అని 36 ఏళ్ళ బిపాసా వెల్లడించారు. ఈ కొత్త చిత్రం గురించి ఆమె చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆ మాటే చెబుతూ, ‘‘ఇక నుంచి ఎప్పుడూ హారర్ కథా చిత్రాలే చేస్తారేంటి అన్న ప్రశ్నకు ఇక దూరంగా ఉండచ్చు ’’ అని ఈ బాలీవుడ్ హారర్ క్వీన్ నవ్వేశారు. ఆమె నటించిన తాజా హారర్ చిత్రం ‘ఎలోన్’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ‘‘నిజానికి, హారర్ చిత్రాలలో నటించకూడదని ఆ మధ్య అనుకున్నా. అందుకే ‘ఎలోన్’ చిత్రంలో నటించడానికి సంకోచించాను. కానీ స్క్రిప్ట్ చదివాక నో చెప్పాలని అనిపించలేదు’’ అని ఆమె చెప్పుకొచ్చారు.