స్పందించిన బాలీవుడ్ | bollywood tweets its supports for chennai | Sakshi
Sakshi News home page

స్పందించిన బాలీవుడ్

Published Sat, Dec 5 2015 11:06 AM | Last Updated on Mon, May 28 2018 4:05 PM

bollywood tweets its supports for chennai

చెన్నై మహానగరాన్ని దుఃఖసాగరంలో ముంచేసిన వరదలపై దేశవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు సానుభూతి తెలపటంతో పాటు, సహాయ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టగా, తాజాగా బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ విషాద పరిస్థితులపై స్పందించారు. తమ ట్విట్టర్ పేజ్లపై చెన్నై నగరం తిరిగి కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.

బిగ్ బి అమితాబ్ బచ్చన్, 'చెన్నై నగరం మునిగిపోయింది, అక్కడి ప్రజలు ఈ ఇబ్బందుల నుంచి సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నా, సాయం అందించటానికి ఇంతమంది ముందుకు రావటం ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు. చెన్నై ఎక్స్ ప్రెస్ పేరుతో సినిమా తీసిన షారూక్ కూడా చెన్నై వాసుల కష్టాలపై స్పందించాడు. 'కష్టాల్లో ఉన్న చెన్నై ప్రజలను దేవుడు కాపాడాలి. ప్రకృతి విధ్వంసం నుంచి బయటపడే మానసిక ధైర్యం అక్కడి ప్రజలకు కలగాలి' అంటూ పోస్ట్ చేశాడు.

సోనాక్షి సిన్హా, అలియా భట్, ఫర్హాన్ అక్తర్, పరిణీతి చోప్రా లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా చెన్నై వాసుల కష్టాలపై స్పందించారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేయాలని, ప్రజలు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలని ఆకాంక్షించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement