
బర్త్ డే సర్‌ప్రైజులు ఎవరికి ఇçష్టం ఉండదు చెప్పండి. మనకైనా పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్‌కైనా ఒక్కటే. బ్రిట్నీ 36వ పుట్టినరోజుకి తన బాయ్ ఫ్రెండ్ సామ్ అస్గరి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన గది నిండా కొవ్వొత్తుల వెలుగులతో, టేబుల్ అంతా కప్ కేక్స్‌తో, గులాబి రేకులను హృదయాకారంలా పరిచి, హ్యాపీ బర్త్‌డే బెలూన్‌తో డెకరేట్ చేశాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘నా వన్ అండ్ వోన్లీ గర్ల్‌కి హ్యాపీ బర్త్‌డే.
అందమైన అమ్మాయికి అసలు సిసలైన అర్థం చెప్పినందుకు, ముఖ్యంగా పూర్తి నాదానివే అయినందుకు థ్యాంక్యూ’’ అని కూడా పేర్కొన్నాడు సామ్. ‘‘ఇంతకంటే ఏం కోరుకోను’’ అని బ్రిట్నీ ఆనందం వ్యక్తం చేశారు. అన్నట్లు 36 ఏళ్ల బ్రిట్నీకి ఇప్పటికి రెండు పెళ్లిళ్లయ్యాయి. అవి పెటాకులయ్యాక మూడో పెళ్లి చేసుకోలేదు కానీ, సామ్ అస్గర్‌తో లవ్‌లో పడింది. బ్రిట్నీకన్నా సామ్ 13 ఏళ్లు చిన్నవాడు. అతని వయసు 23 ఏళ్లు. అయినా ప్రేమకు వయసుతో సంబంధం ఏముంటుందిలెండి? మనసులు కలవడం ముఖ్యం కదా.