ఆ రోజు అందరి కళ్లూ నా పైనే! | Cannes battle begins: Sonam Kapoor trumps Katrina Kaif | Sakshi
Sakshi News home page

ఆ రోజు అందరి కళ్లూ నా పైనే!

Published Sun, Apr 26 2015 11:06 PM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

ఆ రోజు అందరి కళ్లూ నా పైనే!

ఆ రోజు అందరి కళ్లూ నా పైనే!

ఫ్రాన్స్ నగరంలోని కాన్స్ నదీ తీరం అందంగా ముస్తాబవుతోంది. అక్కడ జరిగే చలన చిత్రోత్సవాల కోసమే ఈ ముస్తాబు అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఏడాదీ మే నెలలో జరిగే ఈ ఉత్సవాల్లో ఎర్ర తివాచీపై క్యాట్‌వాక్ చేసే దేశ, విదేశీ తారలను చూడ్డానికి చాలామంది ఇష్టపడతారు. మన దేశం నుంచి ఐశ్వర్యా రాయ్ గత కొన్నేళ్లుగా ఈ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా సోనమ్ కపూర్ కాన్స్ ఎర్ర తివాచి పై సందడి చేస్తున్నారు.
 
  ఈ ఏడాది కత్రినా కైఫ్‌కి కూడా అవకాశం దక్కింది. ఓ సౌందర్య సాధనాల ఉత్పత్తి తరఫున కాన్స్ చలన చిత్స్రోవాల్లో ఆమె క్యాట్ వాక్ చేయనున్నారు. మే 13న ఆరంభమై, 24కి ఈ చిత్రోత్సవాలు ముగుస్తాయి. చివరి రోజున కత్రినా ఎర్ర తివాచీపై ప్రత్యక్షం కాబోతున్నారు. ఆమె ఎలాంటి దుస్తులు ధరిస్తారు? ఎలాంటి నగలు పెట్టుకుంటారు? కేశాలంకరణ ఎలా ఉంటుంది? అనే విషయంపై హిందీ రంగంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం గురించి కత్రినా చెబుతూ - ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళ్లు ఆ రోజు నా పైన ఉంటాయని తెలుసు.
 
  ఈ చిత్రోత్సవాల్లో పాల్గొనే తారల దుస్తులు, నగల గురించి బాగా పట్టించుకుంటారని కూడా తెలుసు. అయినా టెన్షన్ పడటంలేదు. ఎందుకంటే, ఎంత బాగున్నా విమర్శించేవాళ్లు ఉంటారు. ఒకవేళ నేను టెన్షన్ పడితే, సరిగ్గా క్యాట్‌వాక్ చేయలేకపోవచ్చు. అప్పుడు అభాసుపాలవుతాను. అందుకని, ఏదీ మనసులో పెట్టుకోకుండా హాయిగా నడవాలనుకుంటున్నా. కాన్స్ చిత్రోత్సవాలను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నా. ఒకవేళ నాకు నప్పే డ్రెస్ దొరక్కపోతే అప్పుడు సోనమ్‌ని ఓ డ్రెస్ ఇవ్వమని అడగడానికి వెనకాడను’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement