
తిరువనంతపురం(కేరళ): తప్పుడు పత్రాలు సమర్పించి పన్ను ఎగవేసిన ఇద్దరు నటులపై కేరళలో కేసులు నమోదయ్యాయి. కేరళలో లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్‌పై 20శాతం (దాదాపు రూ.20లక్షల వరకు) పన్ను విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ అమలాపాల్, హీరో ఫహద్ ఫాసిల్ తప్పుడు మార్గాన్ని అనుసరించారు. వారు తమ లగ్జరీ వాహనాలను తప్పుడు పత్రాలు సృష్టించి.. రిజిస్ట్రేషన్ చార్జీ తక్కువగా ఉండే పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కేరళ వాసులైన ఈ ఇద్దరు నటులు కేరళలోనే వాహనాలను కొనుగోలు చేసి పుదుచ్చేరిలో రిజిస్టర్ చేసినట్లు తేలింది. అయితే, వారు పుదుచ్చేరిలోనే ఉంటున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులకు చూపించారని విచారణలో వెల్లడవ్వడంతో కేసులు నమోదయ్యాయి.