బాహుబలి బాటలో మెగాస్టార్..! | Chiranjeevi are getting ready for a Bollywood attack with Uyyalawada | Sakshi
Sakshi News home page

బాహుబలి బాటలో మెగాస్టార్..!

Published Sun, May 7 2017 12:27 PM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

బాహుబలి బాటలో మెగాస్టార్..!

బాహుబలి బాటలో మెగాస్టార్..!

ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. నెక్ట్స్ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే చారిత్రక కథాంశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేయాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ బాహుబలి సక్సెస్ తరువాత ఆ ప్రాజెక్ట్ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. రీ ఎంట్రీతో వంద కోట్ల వసూళ్లతో సత్తా చాటిన చిరు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో మరింత భారీ టార్గెట్లకు గురిపెట్టాడు.

అందుకే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాను బాహుబలి తరహాలో మల్టీ లింగ్యువల్ సినిమాగా రూపొదించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో పలు స్ట్రయిట్ హిందీ సినిమాలు చేసిన మెగాస్టార్, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. ఉయ్యాలవాడ కథను బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని భావిస్తున్నాడు. బ్రిటీష్ పాలకుల మీద దండెత్తిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు.

రామ్ చరణ్ నిర్మాత కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరు సరసన బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ని హీరోయిన్గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. అయితే ఒకసారి షూటింగ్ ప్రారంభిస్తే వీలైనంత త్వరగా పూర్తి చేసేలా పక్కాగా ప్రొడక్షన్ను ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement