చిరు 151.. మరో ట్విస్ట్..! | Uyyalawada narasimha reddy just a working title | Sakshi
Sakshi News home page

చిరు 151.. మరో ట్విస్ట్..!

Published Thu, May 18 2017 11:00 AM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

చిరు 151.. మరో ట్విస్ట్..!

చిరు 151.. మరో ట్విస్ట్..!

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన మెగా టీం. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను కూడా చిరుతనయుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటోంది చిత్రయూనిట్. ముఖ్యంగా బాహుబలి 2 రిలీజ్ తరువాత మెగా 151ని కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. మూడు భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ లోనూ గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు అక్కడి నిర్మాతలతో చర్చలు ప్రారంభించారన్న ప్రచారం జరుగుతోంది.

ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్న ఈ సినిమాకు అన్ని భాషలకు కలిసి వచ్చేలా ఒకే టైటిల్ నిర్ణయించాలని భావిస్తున్నారట. అందుకే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని అసలు టైటిల్ రిలీజ్కు ముందు ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. చిరు సరసన బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement