చిరు చిందేస్తే..! | Chiranjeevi Dance Performance at Cine Maa Awards 2016 | Sakshi
Sakshi News home page

చిరు చిందేస్తే..!

Published Tue, Jun 14 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

చిరు చిందేస్తే..!

చిరు చిందేస్తే..!

వెండితెరపై చిరంజీవి తనదైన స్టైల్లో చిందేస్తే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే... ఈలలు పడాల్సిందే. మళ్లీ హీరోగా చిరంజీవి ఎప్పుడు స్టెప్పులు వేస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఎలానూ వచ్చేసింది. ఈలోపే చిరు డ్యాన్స్‌ని చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. ఆదివారం మాటీవీ నిర్వహించిన ‘మా సినిమా అవార్డ్స్-2016’ ఈ డ్యాన్స్‌కు వేదికైంది. హీరో రానా పరిచయ వాక్యాలతో మెగాస్టార్ స్టేజ్‌పై ఎంటరై, హుషారుగా డాన్స్ చేశారు.

దాంతో అవార్డ్స్ కార్యక్రమం హోరెత్తింది. చిరంజీవితో పాటు నవదీప్, సునీల్, సాయిధరమ్‌తేజ్ కూడా చిందే సి వీక్షకులను ఆకట్టుకున్నారు. సునీల్, సుమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు, కె. విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు, బి.గోపాల్, నాగార్జున, అమల, చిన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

కథానాయికలు శ్రీయ, తమన్నా, రకుల్ ప్రీత్‌సింగ్, రాశీ ఖన్నా, ప్రగ్యా జైశ్వాల్, ముమైత్‌ఖాన్ ఆటాపాటా ఈ వేడుకకు హైలైట్‌గా నిలిచాయి. ఆసక్తికరంగా జరిగిన ఈ అవార్డు వేడుకను మాటీవీలో ఈ నెల 25, 26 తేదీల్లో సాయంత్రం ప్రసారం చేయనున్నట్లు చానల్ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement