సాక్షి, ముంబై : బుల్లితెర కమెడియన్ సిధార్థ్ సాగర్.. తన తల్లిదండ్రులపై సంచలన ఆరోపణలకు దిగాడు. మందు పెట్టిన తనకు మాయ చేశారని.. లేని రోగాలను అంటగట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించారని చెబుతున్నాడు.
కపిల్ శర్మ షో ద్వారా పాపులర్ అయిన సిధార్థ్.. గత రెండు వారాలుగా అదృశ్యమయ్యాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అతనికి మతిభ్రమించిందని.. రిహాబిలిషన్ సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నామని.. ఈ క్రమంలో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అనూహ్యంగా మీడియా ముందకు వచ్చిన సిధార్థ్ తన పేరెంట్స్ తనకు అన్యాయం చేశారని చెబుతున్నాడు.
‘ప్రస్తుతం నా తండ్రిగా చెప్పుకుంటున్న వ్యక్తి అసలు నా తండ్రే కాదు. మా అమ్మ-నాన్నలు ఇరవై ఏళ్ల క్రితమే విడిపోయారు. నా తల్లి మరో వివాహం చేసుకున్నారు. చిన్నతనం నుంచే నా సవతి తండ్రి నన్ను తీవ్రంగా హింసించేవాడు. ఆ విషయం నా తల్లికి చెబితే మౌనంగా ఉండేది. నా సంపాదనను కూడా లాక్కుని.. నాకు నరకం చూపించేవాళ్లు. చివరకు నేను ఎదురు తిరిగే సరికి నాకు మతిమరుపు వ్యాధి ఉందంటూ ప్రచారం చేశారు. మందు పెట్టి నన్ను పిచ్చోడ్ని చేశారు. ఇంట్లోంచి గెంటేశారు. చివరకు ఆస్పత్రిపాలుజేశారు. అక్కడి గడిపిన ప్రతీ క్షణం నాకు నరకం. ఎలాగైనా నాకు విముక్తి కల్పించండి’ అంటూ మీడియా సాక్షిగా పోలీసులను అతను వేడుకుంటున్నాడు. అయితే సిధార్థ్ చేసేవి ఆరోపణలని.. అతని వైద్య నివేదికలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమౌతుందని సిధార్థ్ తండ్రి చెబుతున్నారు.
సిధార్థ్ కొద్దిరోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియో
Comments
Please login to add a commentAdd a comment