
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరీం మొరానీ కుమార్తెలు షాజా, జోవా కరోనా నుంచి బయటపడ్డారు. దీంతో వారిద్దరినీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా జోవా మాట్లాడుతూ.. తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ, అనునిత్యం ధైర్యాన్ని నింపిన వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపింది. కరోనాను జయించి ఇంటికి వెళుతుండటం సంతోషంగా ఉందని పేర్కొంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వాన్ని, విపత్కర పరిస్థితుల్లో ఎంతో సున్నితంగా వ్యవహరిస్తున్న మీడియాకు కూడా కృతజ్ఞతలు తెలిపింది. మనల్ని కాపాడేందుకు వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారని, దయచేసి అందరం నియమాలు పాటిస్తూ వారికి సహాయం చేద్దాం అని సందేశమిచ్చింది. (ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్)
ప్రస్తుతం వీరిద్దరినీ హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. షాజా మార్చి మొదటి వారంలో అంటే లాక్‌డౌన్ ప్రకటించడాని కన్నా ముందే శ్రీలంక నుంచి భారత్‌కు వచ్చింది. అలాగే జోవా మార్చి మధ్యలో రాజస్థాన్ నుంచి ముంబై చేరుకుంది. వీరిద్దరినీ పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత నిర్మాత కరీం మొరానీకి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కరీం, షాజా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా, జోవా.. కోకిలాబెన్ ధీరూబాయ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. తాజా పరీక్షల్లో ఇద్దరు కూతుళ్లకు నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. (కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టా: బాలీవుడ్ నటుడు)
Comments
Please login to add a commentAdd a comment