'ఆ సినిమా చూసేందుకు ఆత్రంగా ఉన్నా' | Curious to watch 'Talvar': Shahid Kapoor | Sakshi
Sakshi News home page

'ఆ సినిమా చూసేందుకు ఆత్రంగా ఉన్నా'

Published Mon, Sep 28 2015 6:46 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

'ఆ సినిమా చూసేందుకు ఆత్రంగా ఉన్నా' - Sakshi

'ఆ సినిమా చూసేందుకు ఆత్రంగా ఉన్నా'

ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసు నేపథ్యంగా రూపొందించిన 'తల్వార్' చిత్రాన్ని చూసేందుకు తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ అన్నారు. ప్రస్తుతం షాందార్ అనే చిత్రంలో నటిస్తూ ఫుల్ జోష్పై ఉన్న షాహిద్ తన చిత్రం కన్నా తల్వార్పైనే ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.

'ఈచిత్రాన్ని ఏ కోణంలో రూపొందించారో అని నేను చాలా ఆసక్తితో ఉన్నాను. నాకు తెలిసి దేశం మొత్తం ఈ సినిమాను చూడాలని ఎదురుచూస్తూ ఉండి ఉంటుంది' అని తల్వార్ చిత్రం గురించి చెప్పారు. 2008లో జరిగిన ఆరుషి తల్వార్ హత్య కేసు ఆధారంగా విశాల్ భరద్వాజ్ తల్వార్ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement