బాలల చిత్రోత్సవాలను ప్రారంభించనున్న రణబీర్ కపూర్
బాలల చిత్రోత్సవాలను ప్రారంభించనున్న రణబీర్ కపూర్
Published Thu, Nov 7 2013 2:29 PM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
18వ బాలల చలన చిత్రోత్సవాన్ని హైదరాబాద్ లో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ప్రారంభించనున్నారు. అమీర్ ఖాన్ రూపొందించిన 'తారే జమీన్ పర్' నటించి అందర్ని ఆకట్టుకున్న దర్శీల్ సఫారీ, బాల హస్యనటుడు సలోని దైనీలు ఈ చిత్రోత్సవాలకు హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు.
ఈ చిత్రోత్సవాలలో హోస్ట్ లుగా ఉండటానికి బాల నటులే సమంజసమని భావించాము. చిన్నతనంలో చిత్రాల్లో నటించిన వీరికి.. చిత్రోత్సవాలను కూడా నిర్వహించే సత్తా ఉంటుంది అని మేము బలంగా నమ్ముతున్నాం అని చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ, ఇండియా సీఈఓ శ్రవణ్ కుమార్ తెలిపారు.
ఈ చిత్రోత్సవాలను రణబీర్ కపూర్ ప్రారంభిస్తారని.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆడియో విజువల్ ప్రదర్శన ద్వారా సహకారం అందిస్తారని తెలిపారు. 'చిల్లర్ పార్టీ' చిత్రంతో రణబీర్, సల్మాన్ లకు అనుబంధమున్నందున.. కావున వారిని ఈ చిత్రోత్సవాలకు సహకారం అందిస్తే.. పిల్లలకు అవగాహన కలుగుతుంది అని అన్నారు. ఈ సంవత్సరం 48 దేశాలకు చెందిన 200 చిత్రాలను ప్రదర్శించనున్నామని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement