హాలీవుడ్ కోసం బాలీవుడ్ భామ కసరత్తు
ముంబై: బాజీరావు మస్తానీ భామ దీపికాపదుకోన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేం విన్ డీసెల్ జంటగా తెరకెక్కబోతున్న హాలీవుడ్ మూవీ ‘xxx'. బాలీవుడ్ బ్యూటీ హాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనున్న ఈ ట్రిపుల్ ఎక్స్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్లో హల్ చల్ చే్స్తోంది. సినిమాలోని యాక్షన్ సీన్స్‌లో సూపర్ స్టార్ విన్ డీసిల్‌కు పోటీగా నటించేందుకు దీపికా ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని దీపికా పదుకోన్కు ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తున్న యాస్మిన్ కరాచీవాలా ట్వీట్ చేసింది. ఆమె శిక్షణకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్ అయింది.
అటు దీపికా పదుకోన్ కూడా దీనిపై స్పందించింది. హాలీవుడ్ ఎంట్రీపై తనకు కూడా టెన్షన్‌గా ఉందని కామెంట్ చేసింది. చాలా ఉత్సాహంగా కూడా ఉందని పేర్కొంది. వచ్చేవారమే తన ఫస్ట్ హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం వెళ్లబోతున్నానని చెప్పింది. మొదట డొమినికన్ రిపబ్లిక్‌లో ‘xxx' మూవీ షూటింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. యాక్షన్ స్టార్ విన్‌డీజిల్ నటిస్తున్న ఈ సినిమాలోని యాక్షన్‌సీన్స్‌లో అతనితో పోటీగా నటించేందుకు దీపికా సన్నద్ధమవుతోంది. అందుకే ఎంతో కష్టపడి మరీ ఈ శిక్షణ తీసుకుంటోందని సమాచారం. అటు విన్ డీసిల్ కూడా దీపికాతో యాక్ట్ చేసేందుకు చాలాకాలంగా ఎదురు చూస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాడు.
Yet another training session with @deepikapadukone for #XXX #thereturnofxandercage with @VinDieseI #trainhard pic.twitter.com/qwR6FJDpVZ
— Yasmin Karachiwala (@YasminBodyImage) January 26, 2016