ప్రభాస్‌తో బాలీవుడ్‌ భామ రొమాన్స్‌..! | Deepika Padukone Will Act In Prabhas 21st Movie Tollywood Source | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హిరోయిన్‌

Published Sun, Mar 1 2020 4:50 PM | Last Updated on Sun, Mar 1 2020 5:06 PM

Deepika Padukone Will Act In Prabhas 21st Movie Tollywood Source - Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వినిదత్‌ ఈ సినిమాను నిర్మిచబోతున్నారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభించి వచ్చే ఏడాది చివరల్లో సినిమా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కమర్షియల్‌ డ్రామాగా రూపొందించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరికొత్తగా కనిపించబోతున్నారట. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్ రోమాన్స్‌ చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ప్రభాస్ సరసన నటించనుందని సమాచారం. దర్శకుడు ఆమెకు కథ నరేట్‌ చేశారని, కథ ఆమెకు బాగా నచ్చిందని అంటున్నారు. ఒక వేళ దీపికా ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటే ఇది ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం అవుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.  ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని అన్నారు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. అందుకోసమే దీపికను ఎంపిక చేశారని సమాచారం. ఇక దీపికా తో పాటు భారీ తారాగణం ఉండబోతుందని తెలుతుంది.

కాగా, ప్రస్తుతం ప్రభాస్‌ ‘జిల్‌’ఫేమ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తారు. ఇక దిపికా పదుకొనె ‘83’ సినిమాలో నటిస్తోంది. 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భారత్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా 83 మూవీ రూపొందుతుంది.ఈ సినిమాలో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ నటిస్తుండగా.. ఆయన భార్య రోమి భాటియా(రోమి దేవ్‌) పాత్రలో దీపికా కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement