హాలీవుడ్‌కు ధనుష్ | Dhanush to shoot for Hollywood project from January 2017 | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌కు ధనుష్

Published Tue, Sep 13 2016 1:47 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

హాలీవుడ్‌కు ధనుష్

హాలీవుడ్‌కు ధనుష్

 యువ నటుడు ధనుష్ హాలీవుడ్ ప్రవేశానికి రంగం సిద్ధం అయ్యిందన్నది తాజా సమాచారం. ఈయన ఒక ఆంగ్ల చిత్రంలో నటించనున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుందన్న సమాచారం లేదు. ధనుష్ ప్రస్తుతం తమిళ చిత్రాలలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నారు. ఆయన నటించిన తొడరి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న తెరపైకి రానుంది. ఆ వెంటనే కొడి చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం వెట్ట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రంలో నటిస్తున్నారు.
 
 మరో పక్క మెగాఫోన్ పట్టి రాజ్‌కిరణ్ కథానాయకుడిగా పవర్ పాండి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అంతే కాదు తన మామ సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా రంజిత్ దర్శకత్వంలో కబాలి-2 చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇన్ని విభాగాల్లో ఇంత బిజీగా ఉన్నా తాజాగా హాలీవుడ్ చిత్ర రంగప్రవేశానికీ రెడీ అవుతుండడం విశేషం. ఈయన నటించనున్న హాలీవుడ్ చిత్రం జనవరిలో ప్రారంభం కానుందని తెలిసింది. మర్జాన్ చట్రబీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డనరీ స్టోరీ ఆఫ్ ఏ ఫకీర్ అనే టైటిల్‌ను నిర్ణయంచినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement