‘రాక్షసుడు’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు దర్శకుడు రమేష్ వర్మ. ఈ ఉత్సాహంలోనే తన నెక్ట్స్ సినిమా కోసం హీరో రవితేజకు కథ వినిపించారట. కథ నచ్చడంతో రవితేజ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారట. ‘రాక్షసుడు’ సినిమాను కూడా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన సంగతి తెలిసిందే. గతంలో రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘వీర’ (2011) అనే చిత్రం వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత రవితేజ, రమేష్ కాంబినేషన్ కలవనుందన్న మాట. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 20న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment