కన్నడంలో పువ్వాయ్ పువ్వాయ్...! | dookudu item song 'puvvai puvvai' remakes in kanada | Sakshi
Sakshi News home page

కన్నడంలో పువ్వాయ్ పువ్వాయ్...!

Published Mon, Jan 6 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

కన్నడంలో పువ్వాయ్ పువ్వాయ్...!

కన్నడంలో పువ్వాయ్ పువ్వాయ్...!

ఈ మధ్యకాలంలో వచ్చిన సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్‌లో ‘పువ్వాయ్ పువ్వాయ్...’ ఒకటి. మహేష్‌బాబు నటించిన ‘దూకుడు’లోని ఈ పాటకు తనతో పాటు పార్వతి మెల్టన్ కాలు కదిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే పాటకు కన్నడంలో నీతుచంద్ర డాన్స్ చేస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా కన్నడంలో ‘దూకుడు’ రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ప్రత్యేక పాటలో నీతూ నర్తిస్తున్నారు. ఇటీవలే పునీత్, నీతు పాల్గొనగా ఈ పాట చిత్రీకరణ ప్రారంభించారు. గణేష్ మాస్టర్ నృత్యదర్శకత్వంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని, స్టెప్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని నీతూ పేర్కొన్నారు. ఈ ట్యూన్ చాలా పెప్పీగా ఉందని కూడా తెలిపారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement