‘దూసుకెళ్తా’ అంటూవస్తున్న మంచు విష్ణు
‘దూసుకెళ్తా’ అంటూవస్తున్న మంచు విష్ణు
Published Sat, Aug 10 2013 11:52 PM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
‘దేనికైనా రెడీ’ అంటూ... దమ్మున్న విజయాన్ని అందుకున్నారు మంచు విష్ణు. ఇప్పుడు ‘దూసుకెళ్తా’ అంటూ మరోమారు తన సత్తా నిరూపించుకోబోతున్నారు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి ఇందులో కథానాయిక. వీరు పోట్ల దర్శకుడు. అరియానా, వివియానా సమర్పణలో డా.మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శనివారం విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ -‘‘ ‘దేనికైనా రెడీ’ తర్వాత మళ్లీ ప్రేక్షకుల్ని మెప్పించే సినిమానే చేయాలనుకుంటున్నప్పుడు వీరు పోట్ల ఈ కథ వినిపించాడు. వండర్ అనిపించింది. టైటిల్‌లో పవర్ ఉన్నట్లే, కథలో కూడా పవర్ ఉంది. ‘దూసుకెళ్తా’ అనే టైటిల్ వినగానే చాలామంది అభినందించారు. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
‘‘విష్ణుకి సరిగ్గా సరిపోయే టైటిల్ ‘దూసుకెళ్తా’. సినిమా బాగా వస్తోంది. షూటింగ్ స్పాట్‌లో అన్నీ పాజిటివ్ వైబ్రేషన్సే’’ అని దర్శకుడు చెప్పారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, ఆహుతిప్రసాద్, పోసాని కృష్ణముర ళి, రావురమేష్, పంకజ్ త్రిపాఠి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సర్వేష్ మురారి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్.
Advertisement
Advertisement