మొదటి భార్య నాగరత్న , రెండో భార్య కీర్తితో దునియా
సాక్షి, బెంగళూరు : జిమ్ శిక్షకుడు మారుతీగౌడపై దాడి చేసి జైలుకెళ్లి బెయిల్‌పై బయట వచ్చిన నటుడు దునియా విజయ్ భార్యల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. కీర్తిని తన భర్త విజయ్ రెండో పెళ్లి చేసుకోలేదని మొదటి భార్య నాగరత్న ఆరోపిస్తున్నారు. నాగరత్న వాదనలు ఇలా ఉండగా తామిద్దరం పెళ్లి చేసుకోని ఒకే ఇంటిలో సంసారం చేస్తున్నట్లు విజయ్, కీర్తిలు తెలిపారు. సోమవారం రాత్రి బెయిల్‌పై విడుదలైన దునియా.. కీర్తితో కలిసి గాళి ఆంజనేయస్వామి దేవస్థానం, దర్గాకు వెళ్లి పూజలు చేశారు. జైలు నుంచి విడుదలైనందుకు స్వీట్ల పంచి వేడుక చేసుకున్నారు. దాడి కేసుకు సంబంధించి తనేమి మాట్లాడన్నారు. బెయిల్ మంజూరు చేసిన జడ్జికి, సహకరించిన తన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.
తనకు బెయిల్ రాకూడదని శ్రతువులు ఆశించారని, దేవుడి దయతో బెయిల్ దొరికిందని దునియా పేర్కొన్నారు. తాను జైలుకెళ్లటానికి ప్రధాన కారణం అధికారులేనని ఆరోపించారు. దీనిపై బహిరంగంగా మాట్లాడటానికి సిద్ధమన్నారు. మొదటి భార్య నాగరత్న నాలుగేళ్ల క్రితం తన పరువు తీసి బజారుకు ఈడ్చిందని, తన తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇల్లును ఆమెకు ఇచ్చేశానని, ప్రస్తుతం తాను అద్దె ఇంటిలో ఉంటున్నట్టు చెప్పారు. ఆడ బిడ్డలకు, కొడుకుకు ఉన్న ఆస్తిని రాసిచ్చానని వెల్లడించారు. తాను, తన తల్లిదండ్రులు చచ్చిన రావద్దంటూ విల్లులోనే నాగరత్నకు రాసిచ్చినట్లు తెలిపారు. ఆమె ఒక్క రోజు కూడా నిజం మాట్లాడలేదని విమర్శించారు. మొత్తానికి దునియాకు బయట శత్రువులకంటే ఇంటి పోరే ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment