
తెలంగాణ పరిశ్రమ ఎదగడానికి అందరూ కృషి చేయాలి!
‘‘మన తెలంగాణా నుంచి మంచి సినిమాలు రావడానికి కనీసం ఓ ఏడేళ్లు పడుతుంది. తెలంగాణ సినిమా పరిశ్రమ ఎదగడానికి అందరూ తమ వంతు కృషి చేయాలి. రెండువేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫిల్మ్‌సిటీని ప్రభుత్వమే నడిపే విధంగా ఉంటే బాగుంటుంది’’ అని సీనియర్ దర్శకుడు బి. నరసింగరావు అన్నారు. ‘తెలంగాణ సినిమా అస్థిత్వం’ పేరుతో హైదరాబాద్‌లో జరిపిన సెమినార్‌కు ఆయన అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సానా యాదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాణి శ్రీధర్, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతో పాటు తెలంగాణ మేధావులు, తెలంగాణ సినీ పెద్దలు పాల్గొన్నారు.