కమీనా అందరికీ నచ్చుతుంది
కమీనా అందరికీ నచ్చుతుంది
Published Thu, Aug 29 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
‘‘హిందీలో వచ్చిన ‘జానీ గద్దర్’ చాలా మంచి సినిమా. దానికి రీమేక్ ‘కమీనా’. ఇందులో సన్నివేశాలన్నీ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయి. ఈ రోజుల్లో సినిమా బావుండాలే కానీ, చిన్నా పెద్దా తారతమ్యాలు లేవు. ‘కమీనా’ కచ్చితంగా పెద్ద హిట్టవుతుంది’’ అని హీరో ఆది చెప్పారు. క్రిషి, లేఖా వాషిం గ్టన్ జంటగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో విజయశారద రెడ్డి అరిమండ సమర్పణలో కుబేరా సినిమాస్ సతాకంపై వరప్రసాద్‌రెడ్డి అరిమండ నిర్మించిన ‘కమీనా’ ప్రచార చిత్రాన్ని బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్ర దర్శకుడు నాకు ఎప్పటినుంచో మిత్రుడు. మేమిద్దరం కలిసి సినిమా చేద్దామనుకున్నాం. ఎందుకో కుదర్లేదు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘తొలి కాపీ సిద్ధమైంది.
సెప్టెంబర్ రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. వినోదం, వాణిజ్య అంశాలు కలగలిసిన క్రైమ్ డ్రామా ఇది’’ అని తెలిపారు. క్రిషి మాట్లాడుతూ -‘‘నాకిది తొలి సినిమా. దర్శకుడు అన్నీ దగ్గరుండి చెప్పి చేయించుకున్నారు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు అగస్త్య, కెమెరామేన్ జవహర్‌రెడ్డి, ఎడిటర్ లోకేష్, సహనిర్మాత నవీన్‌రెడ్డి మాట్లాడారు.
Advertisement
Advertisement