
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం `ఫలక్‌నుమా దాస్`. వాజ్ఞ్మయి క్రియేషన్స్ కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మీడియా 9 మనోజ్‌కుమార్ కో ప్రొడ్యూసర్. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 31న విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ సలోని మిశ్రా, తరుణ్ భాస్కర్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ `సినిమా ను ఇటీవల 100 మంది దాకా చూశారు. చూసిన వాళ్లంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. తప్పకుండా అందరికీ నచుతుంది. మే 31న సినిమాను రిలీజ్ చేస్తున్నాం` అన్నారు. అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ `నేను ఇందులో నటించా. మొదట్లో విశ్వక్ మీద నమ్మకం లేదు. కానీ ఓ షార్ట్ ఫిల్మ్ చూపించారు. అప్పుడు విశ్వాక్ మీద నమ్మకం కలిగింది. ఇది మలయాళం సినిమా కి రీమేక్ అని తెలిసిందే`అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment