కలెక్షన్లలో దూసుకుపోతున్న 'ఫ్యాన్‌'! | Fan box office collection, says Shah Rukh Khan film has earned this much in two days | Sakshi
Sakshi News home page

కలెక్షన్లలో దూసుకుపోతున్న 'ఫ్యాన్‌'!

Published Sun, Apr 17 2016 5:17 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

కలెక్షన్లలో దూసుకుపోతున్న 'ఫ్యాన్‌'!

కలెక్షన్లలో దూసుకుపోతున్న 'ఫ్యాన్‌'!

కింగ్ ఖాన్‌ షారుఖ్‌ తాజా సినిమా 'ఫ్యాన్‌' అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతుండగా.. రివ్యూ రేటింగ్స్‌ కూడా బాగానే వచ్చాయి. హీరో- అభిమానికి మధ్య పోరాటంగా తెరకెక్కిన ఈ సినిమాతో షారుఖ్‌ మరోసారి తన మ్యాజిక్‌ రిపీట్‌ చేశాడనే టాక్‌ వినిపిస్తోంది. ఇక సినిమా కలెక్షన్ల విషయానికొస్తే.. ఊహించినట్టే 'ఫ్యాన్‌' భారీ వసూళ్లను రాబడుతున్నది.

మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ. 19.20 కోట్లు వసూలు చేసింది. రెండోరోజుకు వచ్చేసరికి ఈ సినిమా కలెక్షన్లలో భారీ కోత నమోదైంది. రెండో రోజు కేవలం రూ. 15.40 కోట్లు రాబట్టింది. మొత్తంగా భారత్‌లో ఈ సినిమా విడుదలైన తొలి రెండు రోజుల్లో రూ. 34.60 కోట్లు రాబట్టగా.. విదేశాల్లో రూ. 17.93 కోట్లు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలసిస్ట్‌ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement