సినీ దర్శకుడి ఇంట్లో యువతి ఆత్మహత్య! | female worker died in director kodandarami reddy home | Sakshi
Sakshi News home page

సినీ దర్శకుడి ఇంట్లో యువతి ఆత్మహత్య!

Published Sun, May 7 2017 12:54 PM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

సినీ దర్శకుడి ఇంట్లో యువతి ఆత్మహత్య! - Sakshi

సినీ దర్శకుడి ఇంట్లో యువతి ఆత్మహత్య!

హైద‌రాబాద్‌: టాలీవుడ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ఇంట్లో పనిచేసే ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతురాలు తూర్పుగోదావరి జిల్లా కట్టమూరుకు చెందిన జయ. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. దర్శకుడు కోదండరామిరెడ్డి జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.70లో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో జయ అనే యువతి కొంత కాలం నుంచి పనిచేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

అనుమానాస్పద మృతిగా భావించి జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జయతో పాటు ఆమె తల్లి నాగమణి కూడా పనిచేస్తుంది. అయితే కొంతకాలం కిందట స్వగ్రామం కట్టమూరుకు వెళ్లిన జయ తనతోపాటు తల్లి నాగణిని నగరానికి తీసుకొచ్చింది. తన తల్లితో పనిచేయించడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందని కొందరు, తల్లితో తన బాధలు చెప్పుకోలేక మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిందని మరికొందరు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement