మిణుగురులు తరహాలో... | Glow along the lines of ... | Sakshi
Sakshi News home page

మిణుగురులు తరహాలో...

Published Sun, Nov 15 2015 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

మిణుగురులు తరహాలో...

మిణుగురులు తరహాలో...

అందంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఓ వ్యక్తి అనుకోకుండా కాలు పోగొట్టుకుంటాడు. ఆ వ్యక్తి  తన మిగతా జీవితాన్ని ఎలా గడిపాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బంగారు పాదం’. దయా, జ్యోతిశ్రీ ముఖ్య పాత్రల్లో స్వీయదర్శకత్వంలో ఎన్.హెచ్.ప్రసాద్ నిర్మించారు. దర్శక-నిర్మాత మాట్లాడుతూ -‘‘రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది.

వస్తువులకు, మనుషులకు ఉన్న సంబంధాలను ఈ సినిమాలో చూపించాం’’ అని చెప్పారు. ‘‘ ‘మిణుగురులు’ చిత్రం తర్వాత ఆ తరహాలో ఉండే ఈ చిత్రానికి సంగీతం అందించాను. అందరికీ నచ్చే సినిమా ఇది’’ అని సంగీత  దర్శకుడు జోశ్యభట్ల తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement