న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కు ప్రదానం చేసిన పద్మశ్రీ అవార్డును వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. 2010లో సైఫ్కు బహూకరించిన ఈ అవార్డును రద్దు చేయాలని ఎస్ సీ అగర్వాల్ అనే ఆర్టీఐ ఉద్యమకర్త కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.
ఓ రెస్టాంట్లో గొడవపడిన కేసులో సైఫ్పై చార్జిషీటు నమోదు చేయాలని ముంబై కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అగర్వాల్ ఈ డిమాండ్ చేశారు. తన ఫిర్యాదు చేసిన అంశం ఏ దశలో ఉందో తెలిపాలని అగర్వాల్ మరోసారి కేంద్రాన్ని కోరారు. సైఫ్కిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కు తీసుకునే విషయం పరిశీలనలో ఉందని కేంద్రం బదులిచ్చింది. 2012లో ఓ రెస్టారెంట్లో సైఫ్ తన స్నేహితులతో కలసి దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యాపారవేత్త, ఆయన బంధువుపై దాడి చేసినట్టు కేసు నమోదైంది.
సైఫ్ అలీఖాన్ 'పద్మశ్రీ'కి ఎసరు?
Published Wed, Aug 6 2014 8:41 PM | Last Updated on Wed, Apr 3 2019 7:12 PM
Advertisement
Advertisement